మళ్లీ పెరిగిన టీఎస్ ఆర్టీసీ ఛార్జీలు

తాజాగా మరోసారి ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని..

Update: 2022-03-28 07:12 GMT

హైదరాబాద్ : ప్రజా రవాణా సంస్థ అయిన టీఎస్ ఆర్టీసీ మరోసారి ప్రజలపై భారం మోపింది. కొద్దిరోజుల క్రితమే చిల్లర సమస్యను తీర్చేందుకు రౌండప్ పేరిట ఆర్టీసీ ఛార్జీలను సవరించింది. తాజాగా మరోసారి ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది.

ప్యాసింజర్స్ సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలను పెంచినట్లు వెల్లడించారు. అయితే అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News