నేటి నుంచి బెజవాడకు 20 నిమిషాలకొక బస్సు

హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది

Update: 2023-05-16 03:03 GMT

హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అయితే ఇవన్నీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులే. ఈరోజు బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తం యాభై ఎలక్ట్రిక్ బస్సులను ప్రతి రోజూ విజయవాడకు నడపాలని నిర్ణయించారు. విజయవాడకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ బస్సులతో అధికంగా ఆదాయాన్ని ఆర్జించేందుకు టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

నేడు పది బస్సులు....
అందులో భాగంగా పది బస్సులను నేడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. మిగిలిన నలభై బస్సులను కూడా దశల వారీగా ప్రారంభించనున్నామని టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీనికి ఈ-గరుడ గా నామకరణం చేశారు. ఈ బస్సులో ప్రయాణం సుఖవంతంగా ఉంటుందని, తక్కువ సమయంలోనే విజయవాడకు చేరుకునేలా, ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News