Telangana : డిపోలకు మహిళ శక్తి బస్సులు
తెలంగాణలో ఆర్టీసీ డిపోలకు ఇరవై మహిళా శక్తి బస్సులు కేటాయించారు;

తెలంగాణలో ఆర్టీసీ డిపోలకు ఇరవై మహిళా శక్తి బస్సులు కేటాయించారు. ఈ మేరకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ అధికారులు మహిళా శక్తి బస్సులను వివిధ డిపోలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలు నిర్వహించే మహిళా శక్తి బస్సులను ప్రారంభించిన నేపథ్యంలో ఆ బస్సులను వివిధ డిపోలకు ఆర్టీసీ అధికారుల కేటాయించారు.
ఆర్థికంగా బలోపేతం కావడానికి...
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి మహిళ బస్సులను ప్రవేపెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి దశలో ఆర్టీసీ అధికారులు 150 మహిళ బస్సులను వివిధ డిపోలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో విడతలో 450 మహిళ శక్తి బస్సులను కేటాయిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.