రెస్క్యూ టీంలో ఇద్దరు మృతి

సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన రెస్క్యూ టీంలో ఇద్దరు మృతి చెందారు. కుమురం భీం జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది.

Update: 2022-07-14 06:11 GMT

తెలంగాణలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోయాయి. అనేక గ్రామాలు నీట మునిగాయి. దీంతో సహాయక చర్యలలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ విషాదం ఏంటంటే.. సహాయక చర్యల్లో పాల్గొన్న ఇద్దరు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతయ్యారు. ఇద్దరు మృతి చెందారు. కుమురం భీం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

గర్భిణిని రక్షించేందుకు....
కుమురం భీం జిల్లా దేహేగాంలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన రెస్య్కూ టీంలో ఇద్దరు మరణించారు. దహేగాం మంండలంలోని పెసరకుంట వాగు ప్రవహిస్తుంది. ఇక్కడకు సింగరేణి సంస్థ రెస్యూ టీంను పంపింది. రెస్క్యూ టీంలోని సతీష్, రాములు ఇద్దరూ ఒక గర్భిణిని వాగు దాటించే క్రమంలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన సహాయక బృందాలకు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులిద్దరూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో విధులు నిర్వహిస్తున్నారని తెలిసింది.


Tags:    

Similar News