తెలంగాణ రాష్ట్ర కమీషనర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ శ్రీమతి హరి చందనా దాసరి గారిని కలిసిన U-FERWAS ప్రతినిధులు

యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, U-FERWAS ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ మరియు కమీషనర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ శ్రీమతి హరి చందనా దాసరి, IAS ని ఆమె కార్యాలయంలో కలిశారు

Update: 2023-09-03 07:31 GMT

యూ-ఫర్వాస్ ఫుడ్ సేఫ్టీ కమీషనర్ ని కల్తీ ఆహార పదార్థాలని నియంత్రించామని అభ్యధించారు


యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, U-FERWAS ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ మరియు కమీషనర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ శ్రీమతి హరి చందనా దాసరి, IAS ని ఆమె కార్యాలయంలో కలిశారు.
U-FERWAS శ్రీమతి హరి చందన దాసరి గారిని క్రమం తప్పకుండా అన్ని ప్రధాన పాలు, పాల ఉత్పత్తులను వారి డిపార్ట్మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని, పరీక్ష ఫలితాలను పబ్లిక్ డొమైన్‌లో ప్రచురించాలని, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా పాలు, పాల ఉత్పత్తులను అలాగే తిను పదార్థాలు నిరంతరం పరీక్షించి కల్తీ చేస్తున్న, అమ్ముతున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆహారం యొక్క పరిశుభ్రత మరియు నాణ్యతపై హోటళ్లు & ఫుడ్ జాయింట్‌లకు రేటింగ్‌ ఇవ్వాలని. ఆహార కల్తీపై అవగాహన కార్యక్రమాలపై U-FERWAS సభ్యులను భాగస్వాములు చేయాలని కోరారు.

 

U-FERWAS ప్రతినిధుల ఆందోళన, ప్రతిపాదనలకు ప్రతిస్పందనగా శ్రీమతి హరి చందన దాసరి గారు తన డిపార్ట్‌మెంట్ చేస్తున్న కార్యక్రమల లో U-FERWAS ను భాగస్వామి చేయడానికి ఒప్పుకున్నారు, ప్రధానంగా..
1. RWA కమ్యూనిటీలలో ఉచిత ఆయుష్ వైద్య శిబిరాలు.
2. ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఆర్డబ్ల్యూఏ వాలంటీర్స్ కి యోగా ట్రైనింగు అలాగే వారికి సర్టిఫికెట్ ఇచ్చి ఆర్డబ్ల్యూఏ ఏరియాస్ లో వారి ద్వారా యోగ సెషన్స్.
3. రాబోయే వారాల్లో ఆహార కల్తీపై రాష్ట్ర ఆహార భద్రతా విభాగం U-FERWAS సహకారంతో పెద్ద అవగాహన కార్యక్రమం.
శ్రీమతి హరి చందన దాసరి గారు నాచారంలో తమ వద్ద వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ టెస్టింగ్ ల్యాబ్ ఉందని, ఇది పాలు & ఇతర ఆహార ఉత్పత్తులను క్రమం తప్పకుండా పరీక్షిస్తుందని ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని అన్నారు. ఆహార కల్తీపై FSSAI వెబ్‌సైట్ లేదా GHMC కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు అని, వీటిని రోజువారీగా ఆహార భద్రతా విభాగం పర్యవేక్షించి హాజరవుతుందని చెప్పారు.
రాష్ట్ర ఆహార భద్రతా విభాగంతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆహార కల్తీపై తన బృందం రెండు నిమిషాల వీడియోలను రూపొందించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని U-FERWAS ప్రతినిధి పి అశ్విన్ కుమార్ కోరారు. ఈ ప్రతిపాదన కు శ్రీమతి హరి చందన దాసరి గారు అంగీకరించి FSSAI నాచారం ల్యాబ్ డైరెక్టర్ శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి గారికి పిలిచి, అవగాహన వీడియోలు చేయడానికి శ్రీ పి అశ్విన్ కుమార్‌కు సహకరించాలని చెప్పారు.
శ్రీమతి హరి చందన దాసరి గారు ఆహార భద్రతకు సంబంధించిన అన్ని అంశాలలో తను, తన డిపార్ట్మెంట్ RWA లకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందని అన్నారు.
ఈ సమావేశంలో మేజర్ శివ కిరణ్, పి అశ్విన్ కుమార్, కెహెచ్‌ఎస్ శర్మ, కె రాఘవేంద్రరావు, సూర్య ప్రకాష్, బి టి శ్రీనివాసన్ పాల్గొన్నారు.
ఇట్లు
బి టి శ్రీనివాసన్
జనరల్ సెక్రటరీ, యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, U-FERWAS
Tags:    

Similar News