పటేల్ వల్లనే తెలంగాణకు విముక్తి

రజాకర్లపై పోరాడిన యోధులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

Update: 2023-09-17 05:10 GMT

రజాకర్లపై పోరాడిన యోధులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. అందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న అమిత్ షా సైనిక వందనం స్వీకరించారు. అమరజవాన్లకు తొలుత నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదన్న అమిత్ షా పటేల్, కేఎం మున్షీ వల్లనే నిజాం పాలన అంతమయిందన్నారు.

75 ఏళ్ల పాటు వక్రీకరణ...
హైదరాబాద్‌‌కు ఈరోజు విముక్తి లభించన రోజు అని ఆయన అన్నారు. విముక్తి పోరాటంలో పాల్గొన్న యోధులకు ఆయన వందనాలు తెలిపారు. అందుకే ఆ యోధులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు సెప్టంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ చరిత్రను 75 ఏళ్ల పాటు వక్రీకరించారని అమిత్ షా అన్నారు. ఈరోజున తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడానికి మూడు కారణాలున్నాయన్న ఆయన భవిష‌్యత్ తరాలకు నాటి పోరాటాలను గుర్తు చేయడం, పోరాట యోధులను సన్మానించుకోవడం వంటివన్నారు.
పోస్టర్ విడుదల...
నేడు ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సేవా దివస్ గా జరుపుకుంటున్నామని తెలిపారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో పురోగతి సాధించిందన్నారు. ఎంతో మంది పోరాడితేనే నిజాం పాలన అంతమయిందన్నారు. షోయబుల్లా ఖాన్, రామ్ జీ గోండ్ పోస్టర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ భారత్ కు గర్వకారణమని తెలిపారు. రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ విముక్తి పోరాటంలో పరకాల యోధులను మరవలేమని ఆయన అన్నారు.


Tags:    

Similar News