చినజీయర్ స్వామి కృషి అసమాన్యం
రామానుజాచార్యుల సందేశం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు
రామానుజాచార్యుల సందేశం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొన్నారు. తిరునామంతో ముచ్చింతల్ లోని శ్రీరామనగరంకు అమిత్ షా వచ్చారు. సమతామూర్తితో పాటు 108 దివ్యదేశాలను అమిత్ షా సందర్శించారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా సమతామూర్తి విగ్రహం ఆవిష్కరించడం సముచితమని ఆయన అన్నారు.
సనాతన ధర్మం....
ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో కష్టమని, దీనికి శ్రమించిన చినజీయర్ స్వామిని అమిత్ షా అభినందించారు. ఈ క్షేత్రం భవిష‌్యత్ లో ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగుతుందని చెప్పారు. హిందూధర్మాన్ని రక్షించడం కోసం స్వామీజీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలమని చెప్పారు. సమతామూర్తి రాబోయే తరాల వారికి స్ఫూర్తి మంత్రమని అమిత్ షా చెప్పారు. ఆయన ఆలయాల విశేషాలను చినజీయర్ స్వామి వివరించారు.