టీఆర్ఎస్ పియూష్ ఫైర్

వరిధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఘాటుగా వ్యాఖ్యానించారు

Update: 2021-12-21 08:36 GMT

వరిధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు తరలించాలన్నారు. కానీ ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ చేయలేదన్నారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని పియూష్ గోయల్ ఫైర్ అయ్యారు. తాము కొనుగోలు చేస్తామని చెబుతున్నా పదే పదే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇప్పటి వరకూ ధాన్యం సేకరణకు నాలుగుసార్లు ఎక్స్ టెన్షన్ ఇచ్చామన్నారు. బియ్యం తరలింపునకు రైల్వే వ్యాగన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఐదేళ్లలో తెలంగాణ ధాన్యం సేకరణను ఐదు రెట్లు పెంచామని తెలిపారు. ఇప్పటికీ రబీ ధాన్యాన్నే డెలివరీ చేయలేదన్నారు. 

మంత్రులకు పనిలేనట్లుంది...

ఒప్పందం ప్రకారం తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రాష్ట్ర మంత్రులపై విమర్శలు చేశారు. తాము గత రెండు, మూడు రోజుల్లోగా పనుల్లో బిజీగా ఉన్నామని చెప్పారు. వారు ఢిల్లీకి వచ్చి కూర్చుని కలవలేదని అంటే ఎలా అని ప్రశ్నించారు. వారికి అక్కడ ఏం పనిలేనట్లుందని అని పియూష్ గోయల్ ఎద్దేవా చేశారు. అంతకు ముందు తెలంగాణ బీజేపీ నేతలు పియూష్ గోయల్ తో భేటీ పై టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై చర్చించారు. 

Tags:    

Similar News