తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికే ముప్పు
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తప్పుడు సమాచారాన్ని తొలగించడమే ముఖ్యమని యూఎస్ కాన్సులేట్ డిప్లమసీ ఆఫీసర్ ఫ్రాంకీ స్టర్మ్ అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తప్పుడు సమాచారాన్ని తొలగించడమే ముఖ్యమని హైదరాబాద్ లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ ఫ్రాంకీ స్టర్మ్ అభిప్రాయపడ్డారు. తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి ఎలా ముప్పు కలిగిస్తుందో ఆయన వివరించారు. అలాగే పాఠకుల ప్రయోజనం కోసం తప్పుుడు సమాచారాన్ని ఎలా నిర్ధారించుకోవచ్చో కూడా ఆయన జర్నలిస్టులకకు తెలియచేశారు. సోమవారం ఉస్మానియా యూనివర్శిటీలో ఉర్దూ టీవీ జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్‌తో కలిసి వర్క్‌షాప్ నిర్వహించింది. దాదాపు 35 మంది ఉర్దూ జర్నలిస్టులకు తప్పుడు సమాచారాన్ని ఎలా తొలగించాలనే దానిపై శిక్షణ ఇచ్చారు. మొదటి దశలో దాదాపు 40 మంది తెలుగు టీవీ జర్నలిస్టులు విజయవంతంగా శిక్షణ పొంది సర్టిఫికెట్ పొందారు.