తిరుపతి వందేభారత్ రైలు సమయంలో మార్పు
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ రైలు రైల్వే శాఖ సమయాల్లో మార్పులు చేశారు
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ రైలు రైల్వే శాఖ సమయాల్లో మార్పులు చేశారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లే ప్రయాణీకులకు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే శాఖ కోరింది. మే 17వ తేదీ నుంచి ఈ రైలు సమయాల్లో మార్పులు చేశామని తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు ఇకపై ఉదయం 6.15 గంటలకు బయల్దేరి తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుపతి నుంచి వచ్చే రైలు మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి.. రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య 8.30 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం కాస్తా.. 8.15 గంటలకు తగ్గనుంది.
ప్రయాణమిలా...
సికింద్రాబాద్‌లో ఉదయం 6.15 గంటలకు వందేభారత్ రైలు బయలుదేరి నల్గొండకు ఉదయం 7.29 గంటలకు, గుంటూరుకు ఉదయం 9.35 గంటలకు, ఒంగోలు ఉదయం 11.12 గంటలకు నెల్లూరు మధ్యాహ్నం12.29 గంటలకు, తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకోనుంది తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి నెల్లూరు సాయంత్రం 4.49 గంటలకు, ఒంగోలుకు సాయంత్రం 6.02 గంటలకు, గుంటూరుకు రాత్రి 7.45 గంటలకు, నల్గొండకు రాత్రి 09.49 గంటలకు, సికింద్రాబాద్ కు రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుందని రైల్వే శాఖ తెలిపింది.