నేడు వసంతి పంచమి.. కిటకిటలాడుతున్న ఆలయాలు
తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే మంచిదని అందరూ భావిస్తారు.;
తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తే మంచిదని అందరూ భావిస్తారు. తెలంగాణలో బాసర దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు పెద్దయెత్తున తరలి వచ్చారు. బాసరతో పాటు వర్గల్ లో కూడా భక్తులు ఎక్కువగా రావడంతో ఆలయం కిటకిటలాడిపోయింది.
కిటకిటలాడుతున్న ఆలయాలు...
ఆంధ్రప్రదేశ్ లోని ఇంద్రకీలాద్రి పై కూడా భక్తుల సందడి ఎక్కువగా ఉంది. వసంతి పంచమి రోజున ఎక్కువ భక్తులు వస్తారని భావించడంతో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్షరాభ్యాసం కోసం బాసర, వర్గల్, విజయవాడ దుర్గగుడి పైన ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేశారు. సరస్వతి దేవి జన్మదినంగా భావించే ఈరోజు అక్షరాభ్యాసం చేస్తే విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారని అంటున్నారు.