వైఎస్ విజయమ్మ ధర్నా
వైఎస్ షర్మిలను చూసేందుకు వెళుతున్న విజయమ్మను పోలీసులు అడ్డుకోవడంతో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు
వైఎస్ షర్మిలను చూసేందుకు వెళుతున్న విజయమ్మను పోలీసులు అడ్డుకోవడంతో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న విజయమ్మను బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో విజయమ్మ సీరియస్ అయ్యారు. తనను బయటకు పంపకపోతే రాష్ట్రమంతటా ఆందోళనలు చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తానని ఆమె హెచ్చరించారు.
పది నిమిషాల్లో విడుదల చేయకుంటే...
తాను తన కూతురిని చూడటానికే వెళుతున్నానని, మీరు కూడా తన కారులో రావచ్చని విజయమ్మ పేర్కొన్నారు. అయితే పోలీసులు అందుకు అంగీకరించకపోవడంతో ఇంటి ఎదుట ఆమె ధర్నాకు దిగరు. పది నిమిషాల్లో వైఎస్ షర్మిలను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వైఎస్ షర్మిల పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీఐపీ రహదారిపై హంగామా చేసినందుకు 353,333, 327 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.