తెలంగాణలో 80 రోజుల సమ్మెకు తెర

తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్ఏ చర్చలు సఫలమయ్యాయి. సమ్మెను విరమిస్తున్నట్లు వీఆర్ఏ లు ప్రకటించారు.

Update: 2022-10-12 14:34 GMT

తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్ఏ చర్చలు సఫలమయ్యాయి. సమ్మెను విరమిస్తున్నట్లు వీఆర్ఏ లు ప్రకటించారు. దాదాపుగా 80 రోజులుగా సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలను పరిష‌్కరించాలని వారు ఆందోళన చేస్తున్నారు. అసెంబ్లీని కూడా ముట్టడించారు. అయితే ఈ సందర్బంగా తమకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, పే స్కేల్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత...
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్ వీఆర్ఏ సంఘాల నేతలతో చర్చించారు. ఈరోజు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో చర్చలు జరిగాయి. మునుగోడు ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే వీఆర్ఏ పే స్కేల్ ను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారని వీఆర్ఏ సంఘ నేతలు చెబుతున్నారు. దీంతో రేపటి నుంచి వీఆర్ఏలు విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించారు.


Tags:    

Similar News