తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారా.. ఇది మీకోసమే!!

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నప్పటికీ రేషన్ కార్డుల కోసం;

Update: 2025-02-11 03:19 GMT
తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారా.. ఇది మీకోసమే!!
  • whatsapp icon

ఫిబ్రవరి 27న జరగనున్న శాసన మండలి ఎన్నికలకు రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నప్పటికీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మాత్రమే కొత్త కార్డులను జారీ చేస్తారు.

లబ్ధిదారులు మీ సేవా కేంద్రాల్లో కుటుంబ సభ్యులను కార్డులో భాగం చేసుకోవడం, లేదా వేరే కార్డు కోసం అప్లై చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చని సంబంధిత శాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల్లో దరఖాస్తులు ఇచ్చిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. కార్డుల జారీ ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్‌ క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలిస్తారని వివరించారు.


Tags:    

Similar News