బ్రేకింగ్ : తీన్మార్ మల్లన్న అరెస్ట్
ఇటీవలే మల్లన్న బీజేపీ నుంచి బయటికి వస్తున్నట్లు ప్రకటించి ఆ పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. త్వరలోనే కొత్తపార్టీ ..
జనగామ : తీన్మార్ మల్లన్నను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా వరంగల్ లో రైతులకు మద్దతుగా వెళ్తున్న మల్లన్నను వరంగల్ పోలీసులు లింగాలఘనపూర్ మండలంలో అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. వరంగల్ లో లాండ్ పూలింగ్ రియల్ మాఫియా జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి తీన్మార్ మల్లన్న వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యారు.
కాగా.. ఇటీవలే మల్లన్న బీజేపీ నుంచి బయటికి వస్తున్నట్లు ప్రకటించి ఆ పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. త్వరలోనే కొత్తపార్టీ పెట్టనున్నట్లు చెప్పారు. టిఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ.. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న దొంగల ముఠా సభ్యుల సంఖ్య 7200 అని, వారంతా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలేనని దుయ్యబట్టారు. అందుకే మల్లన్న టీమ్ 7200 పేరుతో ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు. ఈ టీమ్ బీజేపీకంటే లక్షరెట్లు నయమని.. ఇకపై బీజేపీ కార్యాలయం గడప తొక్కేదేలేదని స్పష్టం చేశారు. టీమ్ 7200తో టీఆర్ఎస్ ఆగడాలు, కుట్రలు, అవినీతిని బయటపెడతానని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు.