ఆకుపచ్చ రంగులో కృష్ణా నీరు

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకూ నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాయి

Update: 2021-11-28 06:00 GMT

కృష్ణానది నీళ్లు ఆకుపచ్చగా మారాయి. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకూ నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాయి. ఈనీటిని అనేక మంది గ్రామాల ప్రజలు తాగునీటి కోసం వినియోగిస్తారు. గత వారం రోజుల నుంచి కృష్ణా నీరు ఆకుపచ్చగా మారడంతో కాలుష్యం బారిన పడిందన్న ఆందోళన సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనలో ప్రజలు...
కృష్ణా నదీతీరంలో చేపల వేటకు అనేక మంది వెళతారు. మత్స్య కారులు ఈ నదిపై చేపల వేటతో జీవనం సాగిస్తారు. నదీ జలాలు పచ్చగా మారడంతో వారు చేపల వేటకు వెళ్లిన సమయంలో నీరు తాగలేకపోతున్నారు. చేపలు కూడా మృతి చెందుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News