హెచ్చరిక: పొలాల్లో సెల్ ఫోన్లు వాడకండి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు

Update: 2023-07-26 02:03 GMT

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపింది. ఈ మేరకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్‌లో తేలికపాటు నుంచి మెస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పొలాల్లో సెల్‌ఫోన్లు వాడొద్దని రైతులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న సూచించారు. ఉరుములు, మెరుపులు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కరెంట్‌ స్తంభాలు, చెట్ల కింద నిలబడొద్దని, పొలాల్లో ఉన్నప్పుడు నేలపై కూర్చోవాలని సూచించారు.

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. బుధ, గురువారాలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యా శాఖ మంత్రి, అధికారులను ఆదేశించారు. 26, 27 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. గత వారంలో కూడా స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు అధికారులు. గురువారం నుండి శనివారం వరకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వర్షాలు తగ్గడంతో సోమవారం నుండి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.


Tags:    

Similar News