తెలంగాణకు వర్ష సూచన.. ఆ ప్రాంతాలలో భారీ వర్షాలే

దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి.

Update: 2023-07-08 03:49 GMT

తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ చెబుతోంది. శనివారం నాడు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తన ప్రకటనలో తెలిపింది. 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షాలకు ముంబ‌యిలోని పలు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. కర్ణాటకలో భారీ వ‌ర్షాల కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 8కి చేరుకుంది. రానున్న రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జులై 11 వ‌ర‌కు 8 రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో గోవా, కేరళ ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. రాబోయే 5 రోజుల్లో సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ ల‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రాగల ఐదు రోజుల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని శుక్రవారం అంచనా వేసింది.


Tags:    

Similar News