హూయీస్ చికోటీ....? వాటీస్ ది ప్రాబ్లం..
వీఐపీలకి కెసినో ఆటలను ఆర్గనైజ్ చేస్తున్నాడంటూ ఏడాది క్రితం మొదటిసారి వార్తల్లో కనిపించారు చికోటి ప్రవీణ్. ఈడీ రెయిడ్ల జమానా కాబట్టి ఆ కొత్త పేరు పై సర్వత్రా ఆసక్తిరేగింది
వీఐపీలకి కెసినో ఆటలను ఆర్గనైజ్ చేస్తున్నాడంటూ ఏడాది క్రితం మొదటిసారి వార్తల్లో కనిపించారు చికోటి ప్రవీణ్. ఈడీ రెయిడ్ల జమానా కాబట్టి ఆ కొత్త పేరు పై సర్వత్రా ఆసక్తిరేగింది. ఓ నెలరోజుల హైడ్రామా తర్వాత చికోటికి క్లీన్ చిట్ ఇచ్చి వదిలేసారు ఈడీ వారు. అప్పటినుంచి చికోటి తరచూ వార్తల్లో ఉండటం జరుగుతోంది. ప్రవీణ్ ఫామ్ హౌస్‌లో కాస్ట్‌లీ జంతువులు, యాంటిక్ కలెక్ణన్లు, కొండచిలువలు గట్రా పెంచుతున్నాడు అంటూ చాలా విడియోలు బయటికి వచ్చాయి.
అక్కడి నుంచి ఓ రెండు నెలల తర్వాత సడెన్‌గా వచ్చిన ఫేమ్‌ని యుటిలైజ్ చేసుకోవాలి అనుకున్నారో ఏమో.. రాజకీయ రంగప్రవేశానికి పావులు కదిపారు. అప్పటివరకూ ప్రవీణ్ వెనుక టీయారెస్ వాళ్ళ అంగబలం ఉందంటూ ప్రచారాలు జరిగాయి. ప్రవీణ్ గులాబీ పార్టీలోకి వెళ్తాడు అనుకున్నారు అందరూ. ఈడీ ఇష్యూ తర్వాత ఆ సంబంధాలు తెగినట్టున్నాయి కాబోలు.. ప్రవీణ్ హిందుత్వ స్టాండ్ ఎత్తుకున్నారు. మైనారిటీ అపీస్మెంట్‌తో నడుస్తున్న ప్రస్తుత ప్రభుత్వ తీరువల్ల రాష్ట్రంలో హిందూవాదం రైజింగ్‌లోకి వచ్చింది. చికోటి కెసినో చర్చలు సద్దుమణగక ముందే ప్రవీణ్.. హిందు కార్యకర్తలకు తాను అండగా ఉంటానంటూ ప్రకటనలు చేశారు. కేసుల్లో ఇరుక్కునవాళ్ళకు బెయిల్స్ ఇప్పిస్తా అని పలికి ఓ వర్గం యువకులను అమాంతం ఆకట్టుకున్నారు.
నాటి నుంచి నేటివరకూ ప్రభుత్వ ఒత్తిళ్ళను తట్టుకుంటూ కెసినో వ్యవహారాన్ని జాగ్రత్తగా నడుపుకుండా పకడ్బందీగా నడుచుకొస్తున్నారు. ఏనాడైతే ప్రవీణ్ హిందుత్వ నినాదాన్ని ఎత్తుకున్నారో.. ఆనాడే అందరూ అతను బిజేపి లోకి వెళ్తారు అని అనుకున్నారు. తన ఉనికిని హెచ్చించుకోడానికి ప్రవీణ్ అప్పుడప్పుడూ ర్యాలీలు తీస్తూ, కొన్ని జిల్లా కేంద్రాలలో సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సభ్యత్వాన్ని బిజేపి పార్టీ రద్దు చేసిన తర్వాత చికోటి ప్రవీణ్ ర్యాలీగా వెళ్ళి ఓదార్చి వచ్చారు. ఇవాళ కాకపోతే రేపోమాపో చికోటి బిజేపిలోకి వెళ్తారు అని అనుకుంటున్న సందర్భంలో.. నిన్న బిజేపి స్టేట్ ఆఫీస్‌లో అతనికి చుక్కెదురైంది. ఏ కారణంతో అతని జాయినింగ్ ఆపారో (వాయిదా పడింది అని చెప్తున్నారు) కానీ.. అతను బిజేపిలో చేరాలంటే చాలానే అడ్డంకులు ఉన్నాయనేది స్పష్టమైంది. జోరుగా ర్యాలీతో వెళ్ళిన ప్రవీణ్.. జరిగిన పరిణామానికి ఖంగుతిన్నారు. కానీ కార్యకర్తలు నీరసబడకుండా కొన్నాళ్ళు ఆగి తిరిగి వద్దాం అని వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసారు