పైలట్ రోహిత్ రెడ్డి హాజరుపై సస్పెన్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది

Update: 2022-12-27 04:52 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. తాను హాజరు కావడం లేదని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. అయితే ఈడీ అధికారులు మాత్రం ఆయనను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. నేడు విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నందకుమార్ ను జైలులో ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించారు.

కోర్టులో కేసు ఉండగా...
నందకుమార్ ను విచారించిన తర్వాత ఈడీ అధికారులు రోహిత్ రెడ్డిని వప్రశ్నించాలనుకున్నారు. అయితే ఈడీ విచారణను నిలిపివేయాలంటూ పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటీషన్ వేశారు. రేపు దీనిపై విచారణ జరగనుంది. హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో తాను ఈడీ అధికారుల ఎదుటకు వెళ్లనని రోహిత్ రెడ్డి చెబుతుండగా, కోర్టులో ఎటువంటి తీర్పు రానందున విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు అంటున్నారు. మరి చివరకు రోహిత్ రెడ్డి ఈరోజు ఈడీ కార్యాలయానికి వస్తారా? రారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన ఇంకా ఇంట్లోనే ఉన్నారు.


Tags:    

Similar News