Telangana : గాలివాన బీభత్సం.. పోలింగ్ కు ప్రశాంత వాతావరణం
ఆదివారం రాత్రి తెలంగాణ అంతటా గాలివాన బీభత్సం సృష్టించింది.వానతో పాటు వర్షం కురవడంతో పలు చోట్ల వృక్షాలు విరిగిపడ్డాయి
ఆదివారం రాత్రి తెలంగాణ అంతటా గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానతో పాటు వర్షం కురవడంతో పలు చోట్ల వృక్షాలు విరిగిపడ్డాయి. విద్యుత్తు స్థంభాలు నేలకొరగాయి. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ప్రారంభమయిన గాలివాన దాదాపు అరగంట సేపు సాగింది. అనేక చోట్ల పిడుగులు పడి మరణించినట్లు వార్తలు అందుతున్నాయి. అత్యధికంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 8.9 సెంటీమీటర్ల వర్షం నమోదయింది.
ఈ నెల 16వ తేదీ వరకూ...
వరంగల్ జిల్లా మంళవారిపేటలో 8.2 సెంటీమీటర్లు గోవిందరావుపేటలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ నెల 16వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పోలింగ్ రోజు చల్లటి వాతావరణం ఉండటంతో అత్యధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చే అవకాశాలున్నాయన్న అంచనా వేస్తున్నారు.