షెడ్యూల్ ప్రకటించిన గంటల్లోనే.. కరెన్సీ కట్టలు సీజ్
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే దాదాపు పన్నెండు లక్షలను అధికారులు సీజ్ చేశారు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే దాదాపు పన్నెండు లక్షలను అధికారులు సీజ్ చేశారు. షెడ్యూల్ విడుదలయిన వెంటనే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఈ డబ్బు పోలీసులకు చిక్కింది. ఎక్కడికక్కడ సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో కరెన్సీ కట్టలు బయట పడ్డాయి.
12 లక్షల వరకూ...
వైరా డివిజన్‌లో పన్నెండు లక్షల రూపాయల కరెన్సీ నోట్లను అధికారులు సీజ్ చేశారు. కారులో తరలిస్తున్న రెండు లక్షల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ద్విచక్రవాహనం పై ఐదు లక్షలు, మరో వాహనంలో ఐదు లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు. ఈ నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు నగదుతో పాటు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.