హైకోర్టుకు వైఎస్ అవినాష్ రెడ్డి

వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు;

Update: 2023-04-17 05:43 GMT

వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ను మంజూరు చేయాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి పిటీషన్ విచారణ రానుంది. హౌస్ మోషన్ పిటీషన్ వేయడంతో దానిని హైకోర్టు స్వీకరించింది.

పెండింగ్‌లో ఉన్నా...
తెలంగాణ హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని పిటీషన్‌లో పేర్కొన్నారు. దీంతో పెండింగ్‌లో ఉణ్న అన్ని కేసుల వివరాలను తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ అధికారులు ఈ మధ్యాహ్నం విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డిని పిలిచిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పులివెందుల నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు.


Tags:    

Similar News