పోలీసులపై చేయి చేసుకోలేదు : వైఎస్ విజయమ్మ
తాను పోలీసులపై చేయి చేసుకోలేదని వైఎస్ విజయమ్మ అన్నారు
తాను పోలీసులపై చేయి చేసుకోలేదని వైఎస్ విజయమ్మ అన్నారు. చేయి అలా అన్నానంతేనని వైఎస్ విజయమ్మ వివరణ ఇచ్చారు. కొన్ని మీడియాలో పదే పదే చూపిస్తున్నట్లు తాను పోలీసులను కొట్లలేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తన బిడ్డకు మద్దతుగా అందరూ నిలవాలని కోరారు. పోలీస్ స్టేషన్‌లో తన కుమార్తెను చూసి పోవాలని వచ్చానని, అందుకు కూడా అనుమతించకపోవడం దారుణమని తెలిపారు.
నిజంగా కొట్టాలనుకుంటే...
నిజంగా తాను కొట్టాలనుకుంటే కొట్టేదాన్నని వైఎస్ విజయమ్మ తెలిపారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆమె తల్లి విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల టెర్రరిస్టు కాదు, ఉద్యమకారిణి కాదని అన్నారు. సిట్ కార్యాలయానికి వెళుతున్న షర్మిలమ్మను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఎక్కడ పడితే అక్కడ చేయివేస్తుంటే కోపంతో షర్మిల కొట్టి ఉంటుందని, అందుకోసం కేసులు పెట్టి వేధించడమెందుకని ప్రశ్నించారు.