షర్మిలను జైల్లోకి ఎలా పంపుతారు?

చంచల్ గూడ జైల్లో వైఎస్ షర్మిలను వైఎస్ విజయమ్మ పరామర్శించారు.

Update: 2023-04-25 06:50 GMT

ys vijayamma 

చంచల్ గూడ జైల్లో వైఎస్ షర్మిలను వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిని, ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తిని ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. పోలీసుల అత్యుత్సాహాన్ని, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. షర్మిల ప్రజల కోసం 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిందని, షర్మిల ఇలాంటి అరెస్టులకు భయపడే వ్యక్తి కాదని వైఎస్ విజయమ్మ తెలిపారు. ప్రభుత్వాన్ని 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తుందని, గ్రూప్స్, పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అవుతుంటే అడగటం తప్పా.? అని ఆమె ప్రశ్నించారు. షర్మిల సిట్ కు ఒంటరిగా వెళ్లి ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకున్నట్లు? అని వైఎస్ విజయమ్మ నిలదీశారు.

క్రిమినలా? టెర్రరిస్టా?
వైఎస్ షర్మిల క్రిమినలా? టెర్రరిస్టా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం పిల్లల జీవితాలతో ఆడుకుంటుందని, అందుకే నిరుద్యోగుల సమస్యలపై షర్మిల పోరాటం చేసిందన్నారు వైఎస్ విజయమ్మ. కాంగ్రెస్, బీజేపీ పార్టీల సమావేశాలకు అనుమతులు ఇచ్చి షర్మిలను మాత్రం ఎందుకు ఇంట్లోంచి బయటకు రానివ్వడం లేదన్నారు. ప్రశ్నించే గొంతుకల్ని అరెస్టులు చేయడం న్యాయమేనా? ఇదేనా ప్రభుత్వ విధానం? అంటూ ఆమె నిలదీశారు. షర్మిల మళ్లీ బెయిల్ పై విడుదల అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News