రేపు వైఎస్సార్సీపీ ఐటీ సదస్సు
వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో జరగబోయే ఈ సదస్సుకు హైదరాబాద్ తో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు..;
వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జూన్ 3వ తేదీన హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ తో భారీ సదస్సును నిర్వహిస్తోంది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని బుట్టా కన్వెన్షన్ హాల్ లో శనివారం ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభం అవుతుంది. ఈ మేరకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ ఐటీ విభాగ అధ్యక్షులు సునీల్‌కుమార్ రెడ్డి పోసింరెడ్డి సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు.
వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో జరగబోయే ఈ సదస్సుకు హైదరాబాద్ తో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు పెద్దసంఖ్యలో హాజరు కానున్నారు. ఈ సదస్సులో వైఎస్సార్సీ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి, ఐటీ ఉద్యోగుల సమస్యలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సదస్సుకు వైఎస్సార్సీపీని అభిమానించి ఐటీ ఉద్యోగులంతా హాజరై విజయంవంతం చేయాలని సునీల్ కుమార్ రెడ్డి కోరారు. సదస్సుకు హాజరు కావాలనుకున్నవారు ముందుగా తమపేర్లను నమోదుచేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 7829922666, 7032597980 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.