మోదీ, కేసీఆర్ పై షర్మిల ఫైర్

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. మోదీ, కేసీఆర్ లు దెందూ దెందేనని ఆమె పేర్కొన్నారు

Update: 2022-01-31 08:25 GMT

ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. మోదీ, కేసీఆర్ లు దెందూ దెందేనని ఆమె పేర్కొన్నారు. వారిద్దరూ ఒక తానులో ముక్కలేనని షర్మిల అభిప్రాయపడ్డారు. మోదీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని, కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ జనాలను మోసం చేశారని వైఎస్ షర్మిల అన్నారు.

ఇద్దరూ ఇద్దరే....
కానీ మోదీ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నాడని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్ కూడా ఉద్యోగాలను పీకేస్తూ, నోటిఫికేషన్ లు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నాడని షర్మిల అన్నారు. ఇంటికో ఉద్యగం ఇస్తానన్న కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.


Tags:    

Similar News