టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి ష్మరిల
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వచ్చారు.
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణలో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా తెలంగాణలో నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారని, అయినా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయకుండా వారి పట్ల నిర్దయగా వ్యవహరిస్తుందని వైఎస్ షర్మిల ఆరోపించారు.
భారీగా ట్రాఫిక్ జామ్...
తాము నిరుద్యోగ సమస్యపై కొన్ని నెలలుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమ కార్యాచారణను ప్రకటిస్తామని వైఎస్ షర్మిల ప్రకటించారు. అనంతరం వైఎస్ షర్మిల ఛైర్మన్ బిజనార్ధన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. షర్మిల కార్యాలయంలో వెళ్లడంతో టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం బయట వైఎస్సార్టీపీ కార్యకర్తలు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.