నేటి షర్మిల దీక్ష రద్దు

ysrtp chief ys sharmila canceled the deeksha headed today. this is because of the election code.

Update: 2021-11-16 02:35 GMT

వైఎస్సార్టీపీ షర్మిల ఈరోజు తలపెట్టిన దీక్షను రద్దు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉండటమే ఇందుకు కారణం. వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ సమస్య పరిష్కారాన్ని కోరుతూ ఏదో ఒక జిల్లాలో దీక్ష చేస్తూ వస్తున్నారు. గత కొద్ది నెలలుగా ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల దీక్ష జరుగుతూ ఉండేది.

కోడ్ కారణంగానే....
పాదయాత్ర లో ఉన్నప్పటికీ మంగళవారం దీక్షను వైఎస్ షర్మిల కొనసాగిస్తూ వచ్చారు. ఎన్నికల కారణంగా ప్రస్తుతం పాదయాత్ర కూడా వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మంగళవారం దీక్షను రద్దు చేసుకుంటున్నట్లు వైఎస్సార్టీపీ కార్యాలయం తెలిపింది.


Tags:    

Similar News