బంగారు తెలంగాణ బూటకమనేగా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రంలోని రైతులకు సాయం చేయలేనోడు, దేశంలో రైతులకు సాయం చేస్తాడట అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి వైఎస్ షర్మిల వ్యంగంగా ట్వీట్ చేశఆరు. తామర తెగులు సోకి అకాల వర్షాలకు రైతులు నష్టపోతే వారికి కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదని షర్మిల ఫైర్ అయ్యారు. కేవలం పరామర్శల పేరుతో ముగించేశారని అని అన్నారు.
సాయం కోసం ఎదురు చూసి....
ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూసిన మిర్చి రైతులు అవి రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాల్లోనే మూడు నెలల్లో 17 మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. మీ బంగారు తెలంగాణ ఒట్టి బూటకమని తేలిపోయిందన్నారు. సొంత రాష్ట్రంలోని రైతుల అవస్థలను తీర్చలేని వారు దేశంలోని రైతులకు ఏం సమాధానం చెబుతారని షర్మిల ప్రశ్నించారు.