కేసీఆర్ కు షర్మిల వార్నింగ్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలన్నీ రైతు హత్యలేనని షర్మిల అన్నారు. మెదక్ జిల్లాలోని హవేలి ఘన్ పూర్ మండలంలోని బొగుడ భూపతిపూర్ లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కరణం రవి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
30 మంది రైతులు....
ఇప్పటికి తెలంగాణలో 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కరణం రవి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ నియంత పాలన పోతేనే రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో ఆగుతాయని ఆమె స్పష్టం చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని షర్మిల కోరారు. లేకుంటే ఆందోళన తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.