కేసీఆర్ పై షర్మిల షాకింగ్ కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు

Update: 2021-11-17 13:35 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర ను ఒక హంతకుడంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యమకారుడిగా చెప్పుకునేందుకు కేసీఆర్ కు సిగ్గుండాలని షర్మిల అన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు.

రాజకీయాలకే....
నోటిఫికేషన్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. ఓట్లు, సీట్లు మీద ఉన్న ఆరాటం యువత మీద లేకపోవడం విచారకరమని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. నిరుద్యోగులు మరొక్కరు ఆత్మహత్యకు పాల్పడకుండా నోటిఫికేషన్ విడుడల చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.


Tags:    

Similar News