119 చోట్ల పోటీ : వైఎస్ షర్మిల
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. ఎవరైనా టిక్కెట్లు కావాల్సిన వాళ్లు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. తాను పాలేరు నుంచి బరిలోకి దిగుతానని వైెఎస్ షర్మిల ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో షర్మిల మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేక ఓటు చీలకూడదన్న కారణంతోనే తాము కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి సిద్ధపడ్డానని తెలిపారు.
వ్యతిరేక ఓటు...
విడిగా పోటీ చేయడం వల్ల వ్యతిరేక ఓటు చీలి కేసీఆర్ పార్టీ లబ్ది పొందుతుందని భావించి గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ పార్టీతో కలసి నడిచేందుకు ప్రయత్నించానని తెలిపారు. వ్యతిరేక ఓటు చీల్చామన్న పేరు రాకూడదనే తాను ఢిల్లీకి వెళ్లి పార్టీ నేతలను కలసి వచ్చానని చెప్పారు. అయితే ఇప్పుడు తాము ఒంటరిగా పోట ీచేసినా ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆమె అభిప్రాయపడ్డారు. తాను పాలేరు నుంచి మాత్రమే కాకుండా రెండో చోట నుంచి కూడా పోటీ చేయాలన్న డిమాండ్ ఉందని చెప్పారు.
తెలంగాణలో...
అవసరం అనుకుంటే తన భర్త అనిల్, తల్లి విజయమ్మ కూడా పోటీ చేస్తారని వైఎస్ షర్మిల తెలిపారు. నాలుగు నెలలుగా ఎదురు చూశామని, కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలనను తీసుకు వచ్చే దిశగా ప్రయత్నిస్తామని తెలిపారు. కార్యకర్తలందరూ ఎలాంటి నిరాశ పడవద్దని, తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా పార్టీని ఆదరిస్తారని ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు.