ఎందుకు అడ్డుకుంటున్నారు.. నిలదీసిన షర్మిల

కరోనా నిబంధనల పేరుతో ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని వైఎస్సార్టీపీ ఛీప్ వైఎస్ షర్మిల అన్నారు.

Update: 2022-01-01 14:43 GMT

కరోనా నిబంధనల పేరుతో ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని వైఎస్సార్టీపీ ఛీప్ వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలో ఉన్న వారికి ఒక రూలు? మిగిలిన వారికి మరొక నిబంధనా? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అధికార పార్టీ కార్యక్రమాలకు మాత్రం కరోనా నిబంధనలను అడ్డురావడం లేదన్నారు. మంత్రులు సభలు, సమావేశాలను పోలీసులు అడ్డుకోవడం లేదన్నారు.

కరోనా నిబంధనల పేరుతో....
కానీ తాను రైతు ఆవేదన యాత్ర చేయాలంటే కరోనా నిబంధనల పేరుతో అడ్డుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. విపక్షాలు రైతు కుటుంబాల వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించిన కేటీఆర్ పై కేసు పెట్టాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రైతులు మంచి కోసం తాము కార్యక్రమాలు చేస్తే అవి పాపం, అదే అధికార పార్టీ చేస్తే పుణ్యకార్యమా అని ప్రశ్నించారు.


Tags:    

Similar News