పది వేలు ఏవి కేసీఆర్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పినపాక నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పినపాక నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడారు. వారికి అందిన సాయం, ప్రభుత్వ అధికారులు స్పందించిన తీరుపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. పినపాక నియోజకవర్గం రావిగూడెం గ్రామంలో వైఎస్ షర్మిల బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరద బాధితులు తమ బాధను షర్మిలకు వినిపించారు. మీడియా ముందు ప్రకటించిన నష్టపరిహారం ఎందుకు ఇంతవరకూ బాధితులకు అందలేదని షర్మిల ప్రశ్నించారు.
గతంలోనూ ఇలాగే...
గతంలోనూ వరంగల్, ఖమ్మం జిల్లా రైతులను ఇలాగే కేసీఆర్ మోసం చేశారన్నారు. హామీ ఇచ్చి మరిచిపోవడమే కేసీఆర్ కు తెలుసునని షర్మిల అన్నారు. హామీలు ఇచ్చి ఫాం హౌస్ కు వెళ్లి పడుకోవడం అలవాటుగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. వరదలతో సర్వస్వం కోల్పోయిన ప్రజలకు ఆదుకోకుంటే ముఖ్యమంత్రిగా ఉండి సాధించేదేమిటి అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ దిగిపోయి దళితుడిని ముఖ్యమంత్రిగా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. వరద బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కోరారు.