నేడు షర్మిల రెండు జిల్లాల్లో పర్యటన
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఆమె రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఆమె రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. రైతులకు అండగా నిలిచేందుకు షర్మిల రైతు ఆవేదన యాత్రను చేయననున్నారు. తెలంగాణలో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ సమయంలో అండగా నిలవాలని వైఎస్ షర్మిల భావించి ఈ యాత్రను చేపట్టారు. ప్రధానంగా ధాన్యం కొనుగోలు చేయక, పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె యాత్ర ను చేపట్టారు.
నేడు రెండు జిల్లాల్లో...
ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని ఆంథోల్ నియోజకవర్గంలోని జోగిపేట లో మరణించిన రైతు కుటుంబాన్ని వైెఎస్ షర్మిల పరామర్శిస్తారు. వారికి అండగా నిలవనున్నారను. భరోసా ప్రకటించనున్నారు. అలాగే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో కంచనపల్లిలో రైతు కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారు.