Ysrtp : ఇక రెడీ అవుతున్న వైఎస్ షర్మిల

తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రారంభించిన వైఎస్సార్టీపీ కి ఎన్నికల కమిషన్ గుర్తింపు లభించింది.

Update: 2022-02-24 04:05 GMT

తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రారంభించిన వైఎస్సార్టీపీ కి ఎన్నికల కమిషన్ గుర్తింపు లభించింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతో వైఎస్ షర్మిల కొత్త పార్టీ 2023 తెలంగాణలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమమయింది. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

పాదయాత్రను....
మార్చిలో వైఎస్ షర్మిల పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు షర్మిల తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల సంఘం గుర్తింపు లభించడంతో త్వరలోనే వైఎస్సార్టీపీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షురాలిగా షర్మిలను ఎన్నుకోనున్నారు.


Tags:    

Similar News