ఆదివారం సామూహిక నిరాహార దీక్షలు - అచ్చెన్నాయుడు పిలుపు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు ఆదివారం (రేపు) రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు చేపడుతున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు ఆదివారం (రేపు) రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు చేపడుతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడులకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలకు పిలుపు ఇచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
గవర్నర్ తో టీడీపీ నేతల అపాయింట్ మెంట్
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఏపీ గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. దీంతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ రాత్రి 7:30 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. విశాఖపట్నం గెస్ట్‌హౌస్‌లో గవర్నర్‌తో టీడీపీ నేతలు భేటీ కావాల్సి ఉంది. విశాఖ పోలీసులు నేతలందరిని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచడంతో గవర్నర్ ను వారు కలవలేకపోయారు. దీంతో ఆదివారం ఉదయం 9.45 లకు అపాయింట్ మెంట్ మారింది.
సీఐడీకి సహకరించని చంద్రబాబు
సీఐడీ అధికారులకు ఏ మాత్రం సహకరించడం లేదని, ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పడం లేదని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది.
బాబు కోసం ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది
చంద్రబాబుకు తరపున విజయవాడ ఎసిబి కోర్టులో వాదించడానికి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోధ్రా విజవాడ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు సిద్ధార్థ లోధ్రా అండ్ టీమ్. మరికొద్ది సేపట్లో ఎసిబి కోర్టులో చంద్రబాబునాయుడు తరఫున బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్నారు సిద్ధార్థ లోధ్రా.
పవన్ కు నో ఎంట్రీ...
ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుందామనుకున్న పవన్ కల్యాణ్ కు చుక్కెదురైంది. ఆయన వస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చనే కారణంతో డీజీపీ గన్నవరం ఎయిర్ పోర్టు అధికారులకు లేఖ రాశారు.ఆదివారం సామూహిక నిరాహార దీక్షలుఆదివారం సామూహిక నిరాహార దీక్షలు