ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు.. మొత్తం 34 చోట్ల
మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడంతో సోదాలు చేస్తున్నట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. రెండు [more]
మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడంతో సోదాలు చేస్తున్నట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. రెండు [more]
మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడంతో సోదాలు చేస్తున్నట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 34 చోట్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి మల్కాజ్గిరి ఏసీబీ గా నరసింహారెడ్డి కొనసాగుతున్నారు. మాజీ ఐ జి చంద్రశేఖర్ రెడ్డి అల్లుడే నర్సింహారెడ్డి.. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన ఆరోపణలపై సోదాలు చేస్తున్నారు. హైదరాబాదులో 20 చోట్ల సోదాలు నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ మరొక జిల్లాలో సోదాలు చేస్తున్నారు. అదే మాదిరిగా వరంగల్ లో మూడు చోట్ల, కరీంనగర్ లో రెండు చోట్ల, నల్గొండ లో రెండు చోట్ల సోదాలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టరన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా నరసింహారెడ్డి పైన ఆరోపణలు వచ్చాయి. అయితే ఒక ఏసీపీ స్థాయి అధికారి పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా చాలా మంది బినామీల పేర్లతో కూడా ఆస్తులను కూడబెట్టారని ఆరోపణలున్నాయి మాజీ ఐ జి చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు కావడంతో మంచి పోస్టింగ్ లో ఉంటూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించిన ఆరోపణలు వచ్చాయి.