Survey : ఎన్నికలు జరిగితే... వైసీపీకే అత్యధిక స్థానాలు
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకి 24 నుంచి 25 పార్లమెంటు స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ సర్వే తెలిపింది;
టైమ్స్ నౌ సంస్థ సర్వే వెల్లడించింది. దీని ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకి 24 నుంచి 25 పార్లమెంటు స్థానాలు వస్తాయని అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా టైమ్స్ నౌ, నవభారత్ సంస్థలు ఈ సర్వేనిర్వహించాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో తిరిగి బీజేపీదే అధికారమని పేర్కొంది. దేశంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించనుందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది.
అతి పెద్ద పార్టీగా....
అతి పెద్ద పార్టీగా బీజేపీ 292 నుంచి 338 స్థానాలను దేశంలో గెలుచుకునే అవకాశముందని పేర్కొంది. కాంగ్రెస్ కూటమికి 106 నుంచి 144 స్థానాలు దక్కవచ్చని సర్వేలో తేలింది. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి 20 నుంచి 22 లోక్‌సభ సీట్లు, ఏపీలో వైసీపీకి 24 నుంచి 25 స్థానాలు, వస్తాయని సర్వేలో అంచనా వేసింది. ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్‌కు పదకొండు నుంచి పదమూడు స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇతరులు యాభై నుంచి ఎనభై స్థానాలు దక్కించుకుంటారని అంచనా వేసింది.