ఆళ్ల పిటీషన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూ కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ భూములను టీడీపీ కార్యాలయానికి అక్రమ పద్ధతుల్లో కేటాయించారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి [more]

Update: 2021-04-16 01:10 GMT

మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూ కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ భూములను టీడీపీ కార్యాలయానికి అక్రమ పద్ధతుల్లో కేటాయించారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటీషన్ వేశారు. నీటివనరులున్న ప్రాంతాన్ని కేటాయించడమే కాకుండా భూ కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అయితే దీనిపై హైకోర్టులో తేల్చుకోవాలని, ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటీషన్ ను తిరిగి హైకోర్టులోనే విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు నెలల్లో పిటీషన్ ను విచారించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

Tags:    

Similar News