నా నియోజకవర్గంపై తప్పుడు ప్రచారం

తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలోని స్కూళ్లు బాగా లేవని [more]

Update: 2021-08-20 07:42 GMT

తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలోని స్కూళ్లు బాగా లేవని కొన్ని పత్రికల్లో రాస్తున్నారని, పాఠశాలలను బాగు చేయాలని తపన పడేది జగన్ మాత్రమేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తన నియోజకవర్గం పరిధిలో పాఠశాలల ఆధునికీకరణ పనులు మొదటి దశ ప్రారంభమయ్యాయని చెప్పారు. చంద్రబాబు ఏనాడూ స్కూళ్లను పట్టించుకోలేదని, చివరకు ఆయన చదువుకున్న స్కూల్ ను కూడా బాగు చేయలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు పేరుతో స్కూళ్లను బాగు చేస్తున్న విషయాన్ని ఈ బాకా పత్రికలు మరిచాయా? అని ఆళ్ల రామకృష్ణారెడ్డి నిలదీశారు.

Tags:    

Similar News