మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి అని, బెంగాల్ నుంచి కమ్యూనిస్టులను తరిమేసిన ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ ను కూడా తరిమేయాలని భారతీయ జనతా [more]
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి అని, బెంగాల్ నుంచి కమ్యూనిస్టులను తరిమేసిన ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ ను కూడా తరిమేయాలని భారతీయ జనతా [more]
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి అని, బెంగాల్ నుంచి కమ్యూనిస్టులను తరిమేసిన ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ ను కూడా తరిమేయాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. బెంగాల్ లో బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ నేటి నుంచే లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. మల్దా పట్టణంలో జరిగిన ర్యాలీకి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మమత సర్కార్ గుండాయిజాన్ని ప్రోత్సహిస్తోందని, రాజ్యాంగాన్ని హత్య చేస్తుందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ బాంబుల పరిశ్రమలు స్థాపించారని, తాము అధికారంలోకి వస్తే వాటిని మూసేస్తామని పేర్కొన్నారు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని షా ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఇటీవలి విపక్షాల ర్యాలీపై కూడా అమిత్ షా విమర్శలు గుప్పించారు. విపక్షాల ర్యాలీలో తొమ్మిది మంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు.