నాలుగు కోట్ల డోసులు సరఫరా చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు కోట్ల కరోనా టీకా కోసం తయారీ సంస్థలకు లేఖ రాసింది. భారత్ బయోటెక్, సీరం సంస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. తమకు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు కోట్ల కరోనా టీకా కోసం తయారీ సంస్థలకు లేఖ రాసింది. భారత్ బయోటెక్, సీరం సంస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. తమకు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు కోట్ల కరోనా టీకా కోసం తయారీ సంస్థలకు లేఖ రాసింది. భారత్ బయోటెక్, సీరం సంస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. తమకు 4.08 కోట్ల డోసులు కావాలని ఈ లేఖలో కోరింది. తగినన్ని డోసులను తమకు సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం ఈలేఖలో కోరింది. 2.4 కోట్ల మందికి రెండు విడతలుగా ఇవ్వాల్సి ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే తమకు సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం ఆ రెండు సంస్థలను కోరింది. వ్యాక్సిన్ బిల్లులను వెంటనే చెల్లిస్తామని పేర్కొంది.