హైకోర్టులో గల్లా కుటుంబానికి బిగ్ రిలీఫ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. గల్లా కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థకు చెందిన భూములను వెనక్కు తీసుకుంటూ జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల [more]

;

Update: 2020-07-27 14:44 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. గల్లా కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థకు చెందిన భూములను వెనక్కు తీసుకుంటూ జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరరాజా సంస్థకు గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూమిలో 253 ఎకరాలను వెనక్కు తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News