హైకోర్టుపై క్లారిటీ ఇచ్చారా?
హైకోర్టుపై ఏపీ ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చింది. నిపుణుల కమిటీ నివేదిక తర్వాతనే దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశముంది. పరిపాలన, న్యాయపరమైన అంశాలు రాజధానిలో మాత్రమే ఉండాలని [more]
;
హైకోర్టుపై ఏపీ ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చింది. నిపుణుల కమిటీ నివేదిక తర్వాతనే దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశముంది. పరిపాలన, న్యాయపరమైన అంశాలు రాజధానిలో మాత్రమే ఉండాలని [more]
హైకోర్టుపై ఏపీ ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చింది. నిపుణుల కమిటీ నివేదిక తర్వాతనే దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశముంది. పరిపాలన, న్యాయపరమైన అంశాలు రాజధానిలో మాత్రమే ఉండాలని ప్రభుత్వం సమాధానమిచ్చింది. శాసనమండలిలో టీడీపీ సభ్యుడు కేఈ ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. కర్నూలులో హైకోర్టును గాని, హైకోర్టు బెంచ్ ను గాని ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? అన్న కేఈ ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు నిపుణుల కమిటీ నివేదిక తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని తెలిపింది. దీన్నిబట్టి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. ఈ నెలాఖరుకు నిపుణుల కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందే అవకాశముంది.