గతంలోనూ సీఎం క్యాంపు కార్యాలయాలున్నాయి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయడాన్ని అడ్వొకేట్ జనరల్ ను ప్రశ్నించింది. విచారణ మొత్తం దాని చుట్టూనే తిరిగింది. సిఎం క్యాంపు కార్యాలయాలను [more]
;
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయడాన్ని అడ్వొకేట్ జనరల్ ను ప్రశ్నించింది. విచారణ మొత్తం దాని చుట్టూనే తిరిగింది. సిఎం క్యాంపు కార్యాలయాలను [more]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయడాన్ని అడ్వొకేట్ జనరల్ ను ప్రశ్నించింది. విచారణ మొత్తం దాని చుట్టూనే తిరిగింది. సిఎం క్యాంపు కార్యాలయాలను ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చా? గతంలోనూ ఇలాంటి కార్యాలయాలున్నాయా? అని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే దీనికి సమాధానం చెబుతూ గతంలోనూ చంద్రబాబు అనేక సీఎం క్యాంపు కార్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నారన్న విషయాన్ని ఏజీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు నారావారిపల్లెలోనూ, హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లోనూ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వ ఖర్చుతో నడిపారని ఏజీ ఈ సందర్భంగా చెప్పారు. దీనిపై పూర్తి కౌంటర్ ను దాఖలు చేస్తామని ఏజీ చెప్పారు. దీనిపై విచారణను హైకోర్టు ఈ నలె 9వ తేదీకి వాయిదా వేసింది.