బ్రేకింగ్: ఏపీలో విజయం ఆ పార్టీదే… జాతీయ సర్వే అంచనా

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని రిపబ్లిక్ టీవీ అంచనా వేసింది. నేషనల్ అప్రూవల్ రేటింగ్స్ పేరుతో రిపబ్లిక్ టీవీ [more]

;

Update: 2019-01-24 13:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని రిపబ్లిక్ టీవీ అంచనా వేసింది. నేషనల్ అప్రూవల్ రేటింగ్స్ పేరుతో రిపబ్లిక్ టీవీ – సీఓటర్ సంస్థ చేసిన జాతీయ సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి 19 పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అధికార తెలుగుదేశం పార్టీకి కేవలం 6 స్థానాలు మాత్రమే వస్తాయని తెల్చింది. ఇక జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 41.3 శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 33.1 శాతం, కాంగ్రెస్ కి 9.8 శాతం, బీజేపీకి 7.2 శాతం, ఇతరులకు 8.6 శాతం ఓట్లు వస్తాయని సీఓటర్ సర్వే స్పష్టం చేసింది.

Tags:    

Similar News