వారిపై కోపంతో కేసీఆర్ కు
ప్రోఫెసర్ల పై కోపంతో ఓ వ్యక్తి ఏకంగా సీఎం కేసీఆర్ తో పాటు కొంతమంది ప్రముఖులకు మురికినీటిని పార్శిల్ రూపంలో పంపాడు. తెలివిగా వాటిపై కొందరి పేర్లు [more]
ప్రోఫెసర్ల పై కోపంతో ఓ వ్యక్తి ఏకంగా సీఎం కేసీఆర్ తో పాటు కొంతమంది ప్రముఖులకు మురికినీటిని పార్శిల్ రూపంలో పంపాడు. తెలివిగా వాటిపై కొందరి పేర్లు [more]
ప్రోఫెసర్ల పై కోపంతో ఓ వ్యక్తి ఏకంగా సీఎం కేసీఆర్ తో పాటు కొంతమంది ప్రముఖులకు మురికినీటిని పార్శిల్ రూపంలో పంపాడు. తెలివిగా వాటిపై కొందరి పేర్లు రాసి మస్కా కొట్టించాలనుకున్నాడు. కానీ ఈ పార్సిల్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. అతనిని విచారించి ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. గత రెండు రోజుల క్రితం పోస్టల్ ఆఫీస్ లో చోటుచేసుకున్న మురికినీటి బాటిల్స్ పార్శిల్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి సీఎం నుంచి డీజీపీ వరకు ఈ బాటిల్స్ పంపించి పోలీసు యంత్రాంగానికి పరుగులు తీయించాడు. దీంతో ఈ పార్శిల్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని విచారణ ప్రారంభించారు పోలీసులు. పోస్టల్ కార్యాలయం వద్ద సీసీ టీవీ లను ఏర్పాటు చేసి వాటి ఆధారంగా నిందితుడిని కనిపెట్టాలనుకున్నారు. మరో వైపు కేసును చేధించడానికి రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..ఆ సమయంలో పార్సిల్ దింపిన ఆటో విడియో ఆధారంగా రంగంలోకి దిగారు.
ఫెయిల్ కావడానికి…..
పోస్టల్ కార్యలయంలో సీసీ కెమెరాలు లేక పోవడంతో..ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరా లను పరిశీలించి చివరకి ఆటోను కనిపెట్టారు. ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకోని పార్శిల్స్ గురించి విచారించగా ఆ బాటిల్స్ ను మోండా మార్కెట్ లోని ఓ షాపు నుంచి తెచ్చినట్టు పోలీసులకు చెప్పాడు. దీంతో ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా..బాటిల్స్ పార్సిల్ చేసింది కుమ్మరి గూడకు చెందిన వెంకటేశ్వర్లు ఆలియస్ వెంకట్ గా గుర్తించారు. ఇదంతా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లపై కోపంతో మురికినీటి సీసాల పార్శిల్ పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు వెంకటేశ్వరరావును 4 రోజుల పాటు పోలీసులు విచారించగా ఈ విషయం వెల్లడైంది. ఉస్మానియా ప్రొఫెసర్ల పేరుతో సీఎం, డీజీపీ, కేటీఆర్‌కు పార్శిల్ పంపినట్లు నిందితుడు వెంకటేశ్వరరావు అంగీకరించాడు. ఉస్మానియా వర్సిటీలో తాను ఎంబీఏ ఫెయిల్ అయ్యానని, అందుకు ఓయూ ప్రొఫెసర్లే కారణమని ఆయన ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్లపై కోపంతో వారి పేర్లతోనే వీఐపీలకు మురికినీటి సీసాలు పంపినట్లు నిందితుడు వెంకటేశ్వరరావు వెల్లడించాడు.