జగన్ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. మైనింగ్ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇతర అవసరాలకు వినియోగించ వద్దని హైకోర్టు ఆదేశించింది. మైనింగ్ భూములు కేంద్ర ప్రభుత్వ [more]

;

Update: 2020-08-13 08:33 GMT

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. మైనింగ్ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇతర అవసరాలకు వినియోగించ వద్దని హైకోర్టు ఆదేశించింది. మైనింగ్ భూములు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని, వాటిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదని హైకోర్టు పేర్కొంది. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు, టంగుటూరు మండలాల్లో మైనింగ్ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చేందుకు వేసిన పిటీషన్ పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News